YCP Leaders Dharna: సొంతపార్టీ ఎమ్మెల్యేపై ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులు
సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే విమర్శలకు దిగారు వైసీపీ నేతలు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అండతో కొంత మంది తమ కులానికి కేటాయించిన మైన్స్ లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తమకు కేటాయించినా..అప్పటి నుంచి కోర్టు కేసులు వేసి తమను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తాడికొండ ఎమ్మెల్యే దృష్టికితీసుకెళ్లినా ఆమె పట్టించుకోవటం లేదని వైసీపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన చేశారు వైసీపీ నేతలు.