Minister srinivasa Goud : మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండలో పర్యటించిన మంత్రి | ABP Desam

ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి వచ్చి కరోన వైద్యానికి చికిత్స అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పేర్కొన్నారు. కరోనా ను ఎదుర్కోవడంలో భాగంగా “ ఇంటింటా ఆరోగ్యం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. "ఇంటింటా ఆరోగ్యం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి జ్వరాలు , దగ్గు ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola