Union Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam
HMPV వైరస్ కొత్త వైరస్ కాదని కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి జేపీ నడ్డా తెలిపారు. దేశంలో ఒకేరోజు ఐదు HMPV వైరస్ కేసులు నమోదు అవటంతో...మాట్లాడిన నడ్డా..ఈ వైరస్ వ్యాప్తి 2001 నుంచే గుర్తించామని..చైనాలో నమోదవుతున్న కేసులను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.HMPV వైరస్ కొత్తదేం కాదని వైద్యఆరోగ్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 2001లో ఈ వైరస్ ను కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారు. గాలి ద్వారా సోకే ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరి ఇబ్బంది పెడుతుంది. అన్ని వయస్సుల వారికి సోకుతుంది. చలికాలంలో ఎక్కువగా సోకే అవకాశాలున్నాయి. చైనాలో HMPV వైరస్ కారణంగా వస్తున్న కేసులను మన దేశ ఆరోగ్యశాఖ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. WHO కూడా త్వరలోనే మనకు రిపోర్ట్ పంపిస్తుంది. మనదేశంలో ICMR ఈ కేసులను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఇంటిగ్రెటెడ్ డిసీస్ సర్వైవలెన్స్ ప్రోగాం ను కూడా సమీక్ష చేస్తాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తో కలిసి ఈ వైరస్ వ్యాప్తిపై జనవరి 4నే సమీక్ష నిర్వహించాం. పరిస్థితిని జాగ్రత్తగా సమీక్షిస్తున్నాం. కంగారు పడాల్సిన పనిలేదు. మనం అప్రమత్తంగానే ఉందాం. జాగ్రత్తగా ఉందాం. ధైర్యంగా ఎదుర్కొందాం.