Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP Desam

Continues below advertisement

 నేను రమేశ్ బిధూరికి చెప్తున్నా..నా తండ్రి తన జీవితాంతం ఉపాధ్యాయుడిగా బతికాడు. తన జీవితం మొత్తంలో  ఎన్నోవేల మంది పేద మధ్య తరగతి విద్యార్థులకు చదువును నేర్పించాడు. ఇప్పుడు 80 ఏళ్ల వయస్సులో ఆయన మంచం పట్టి ఉన్నారు. కనీసం లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు తిట్టారు. కేవలం ఎన్నికల కోసం ఇంతటి నీచానికి దిగజారాలా.? ఓట్లు కోసం అవతలి వ్యక్తిని ఇంత వ్యక్తిగతంగా దూషించే స్థితికి మీరు పడిపోయారు. మనదేశ రాజకీయాలు ఇంతటి దుస్థితికి దిగజారిపోతాయని నేనెప్పుడూ అనుకోలేదు. 


 ఢిల్లీ సీఎం ఆతిషి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడ్చేశారు. రానున్న ఢిల్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గంలో తన పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై ఎమోషనల్ అయ్యారు ఆతిషి. జీవితాంతం ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎంతో గౌరవంగా బతికిన తన తండ్రి 80ఏళ్ల వయస్సులో..మంచం మీద లేవలేని స్థితిలో ఆయన్ను బిధూరి దూషించటాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి ఆతిషి. ఎన్నికల కోసం ఇంత దిగజారిపోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram