ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP Desam

Continues below advertisement

 అంతరిక్షంలో భారత్ అద్భుతం చేసింది. ఇస్రో నాలుగు రోజుల క్రితం ప్రయోగించిన స్పేడెక్స్ ఉపగ్రహాలు అంతరిక్షంలో తిరుగుతున్నాయి. టార్గెట్ శాటిలైట్ కోసం ఛేజర్ శాటిలైట్ తిరుగుతున్న ఈ టైమ్ లో ఇస్రో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అనౌన్స్ చేసింది. అదే అంతరిక్షంలో వ్యవసాయం. చంద్రుడు భూమి కక్ష్యలో తిరుగుతున్న స్పేడెక్స్ ఉపగ్రహాల్లో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్(క్రాప్స్ ) అనే ప్రయోగం కూడా చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా 8 అలసంద గింజలను అంతరిక్షంలోకి పంపించారు.  సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ఉండే అంతరిక్షంలో పంటలు పండాలంటే ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించాలి. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు దాని మీద పనిచేసే ఈ క్రాప్స్ అనే మాడ్యూల్ ను తయారు చేశారు. ఇప్పుడు  నాలుగు రోజుల్లోనే ఆ అలసంద గింజల్లో ఓ గింజ పగిలి మొలకెత్తేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆకులు కూడా వస్తాయని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. మరోవైపు ఉపగ్రహానికి ఉన్న రోబోటిక్ హ్యాండ్ పనిచేసేలా చేయటం...సెల్ఫీ వీడియో తీసుకునేలా చేయటం లాంటివి చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగాలన్నీ భారత్ సొంతంగా స్పేస్ స్టేషన్ ను నిర్మించుకోవాలనే లక్ష్యానికి దోహదం చేస్తాయి. భవిష్యత్తులో అంతరిక్షం వేదికగా చేపట్టబోయే వ్యవసాయానికి మూలం అవుతాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram