
Sunita Williams Return to Earth | భూమ్మీద దిగనున్న సునీతా విలియమ్స్..ముహూర్తం అప్పుడే | ABP Desam
9నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు సునీతమ్మ మన భూమి మీద తిరిగి అడుగుపెట్టబోతోంది. తొమ్మిది నెలలుగా అంతరిక్షాన్ని తన నివాసంగా మార్చుకుని భూమ్మీదకు ఎప్పుడు ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ కు పర్మిషన్ వచ్చేసింది. ఇందుకు ముహూర్తం కూడా పెట్టేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్ ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించేశాయి.
సునీతా విలియమ్స్, విల్ బుచ్ మోర్ తో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ కూడా భూమ్మీదకు వస్తారు. మరో ఇద్దరి పేర్లు నిక్ హేగ్, రష్యా కాస్మానాట్ అలెగ్జాండర్ గోర్భునోవ్. సో వీళ్లు నలుగురు కలిసి క్రూ9 అన్న మాట. ఇప్పుడు కొత్తగా క్రూ 10 లో నలుగురు వచ్చారు కదా అంతరిక్ష కేంద్రానికి అదే స్పేస్ వెహికల్ లో ఈ నలుగురు భూమ్మీదకు దిగుతారన్న మాట. భారత కాల మానం ప్రకారం మార్చి 18 మంగళవారం ఉదయం 8.15 నిమిషాలకు సునీతా విలియమ్స్ వాళ్లు భూమ్మీదకు దిగే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే వాళ్లేమీ లిఫ్ట్ ఎక్కి కిందకి దిగినట్లుగా వెంటనే వచ్చేయలేరు. చాలాప్రోసెస్ ఉంటుంది. ఆ ప్రోసెస్ ఏంటనేది ఇంకో వీడియో చేస్తున్నాం. అందులో డీటైల్డ్ గా చెప్తాం. సో మంగళవారం ఉదయం 8.15 గంటలకు అంతరిక్షం నుంచి ప్రారంభమై...మార్చి 19 బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య ఫ్లోరిడా సముద్ర తీరంలో స్ప్లాష్ డౌన్ అవుతారు. సో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే నాసా టెక్నీషియన్స్ స్విమ్మర్స్ నలుగురు ఆస్ట్రోనాట్స్ ను క్యాప్సూల్ నుంచి బయటకు తీసి నాసా సెంటర్ కు తీసుకువస్తారు. సో సునీతమ్మ రాక కోసం అంతా సిద్ధమైపోయిందన్నమాట.