
Sunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABP
నాసా ఆస్ట్రానాట్, మన భారతీయ మూలాలున్న మహిళ సునీతా విలియమ్స్ తొమ్మిదినెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారని మనకందరికీ తెలుసు కదా. ఎట్టకేలకు ఆమె భూమ్మీదకు దిగే ప్రక్రియ ఈ మంగళవారం ప్రారంభం అవుతోంది. క్రూ10 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వేసుకొచ్చిన ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ వాళ్ల డ్రాగన్ క్యాప్సూల్ లోనే క్రూ 9 భూమ్మీదకు దిగుతోంది. క్రూ 9లో మొత్తం నలుగురు ఉంటారు. సునీతా విలియమ్స్ తో పాటు స్పేస్ లో చిక్కుకుపోయిన బుచ్ విల్ మోర్...ఇంకా నిక్ హేగ్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉంటారు. అయితే వీళ్లు భూమ్మీదకు దిగే ప్రోసెస్ దశల వారీగా జరుగుతుంది. అవేంటో డీటైల్డ్ గా చెప్పుకుందాం.హేచ్ క్లోజింగ్ అంటే ఏం లేదు సింపుల్ గా చెప్పుకోవాలంటే చుట్టాలను బయటకు పంపించి తలుపులు వేసుకోవటం లాంటిది అన్నమాట. ఇన్నాళ్ల పాటు స్పేస్ లో గడిపిన సునీతా విలియమ్స్ ఇంకా ముగ్గురు ఆస్ట్రోనాట్స్ కు అక్కడ ఉన్న మిగిలిన సైంటిస్టులు టాటా గుడ్ బైలు చెప్పేసి ఇదిగో ఇలా డోర్ క్లోజ్ చేస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డాకింగ్ అయ్యి ఉన్న క్యాప్సూల్ ను అన్ డాకింగ్ అంటే విడిపోయే ముందు ఈ హ్యాచ్ క్లోజింగ్ అనే ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేస్తారు.