
Sunita Williams Return to Earth Biography | సునీతా విలియమ్స్ జర్నీ తెలుసుకుంటే గూస్ బంప్స్ అంతే| ABP Desam
ఆడవాళ్లకు ఓపిక సహనం ఎక్కువ అంటారు కదా..అందునా భారతీయ స్త్రీలు రియల్లీ స్ట్రాంగ్ ఫైటర్స్ అంటారు కదా. హియర్ ఈజ్ ద ఎనదర్ ఎగ్జాంపుల్..సునీతా విలియమ్స్. వారం రోజుల పనుండి స్పేస్ కి వెళ్తే అనుకోకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల పాటు స్పేస్ లో నే చిక్కుకుపోయారు. అసలు ప్రిపేర్ అయ్యి ఉండరు దీనికి. కానీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ కాబట్టే సునీతా విలిమయ్స్ ఈ రోజు మనకందరికీ చాలా ప్రౌడ్ గా మారిపోయారు. రేపు అంతరిక్షం నుంచి ప్రయాణం ప్రారంభించి భూమ్మీదకు దిగనున్ను ఈ సునీతా విలియమ్స్ అసలు ఎవరు..ఈమెకు మన భారత్ కు సంబంధం ఏంటీ..అసలు ఆమె బయోగ్రఫీ ఏంటో ఓ సారి చూసేద్దాం. 1965 సెప్టెంబర్ 19న సునీతా విలియమ్స్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో యూక్లిడ్ లో జన్మించారు. సునీతా విలియమ్స్ తండ్రి పేరు డా. దీపక్ పాండ్యా..ఆయనది గుజరాత్ లోని మెహ్సానా ప్రాంతం. స్వతహాగా న్యూరో అనాటమిస్ట్ అయిన దీపక్ పాండ్యా గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు. స్లొవేకియా దేశానికి చెందిన బొన్నీని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీళ్లిద్దరికీ జన్మించిన అమ్మాయే మన సునీతా పాండ్యా.