Srilanka President Gotabaya Rajapaksa Declares Public Emergency: రోజురోజుకూ దారుణ పరిస్థితులు

Srilanka లో Public Emergency విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు Gotabaya Rajapaksa నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్ జారీ చేశారు. ప్రజల భద్రత, అత్యవసర సేవలు, నిత్యావసరాలు సరఫరాను దృష్టిలో పెట్టుకుని ఎమర్జన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో గత కొన్ని రోజులుగా అన్ని ధరలూ భారీగా పెరిగిపోయాయి. ఆహార పదార్థాల కొరత, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది ఆందోళన కోసం రోడ్డెక్కి ఏకంగా అధ్యక్షుడి భవనాన్నే చుట్టుముట్టారు. ఈ నిరసన తీవ్రరూపం దాల్చి పలు హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola