SpaceX catches Starship booster with Chopsticks | Mechzilla తో రాకెట్ ను క్యాచ్ పట్టిన SpaceX | ABP
400 అడుగుల ఎత్తైన అతిపెద్ద స్టార్ షిప్ రాకెట్ ను ప్రయోగించి ఎలన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ స్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్. ఇందులో గొప్ప ఏంటంటే ప్రయోగించిన రాకెట్ కింది భాగాన్ని మనకు విజువల్స్ లో కనిపిస్తున్న భారీ టవర్ అత్యంత నేర్పుగా క్రికెట్ లో బాల్ ను ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్నట్లు ఒడిసి పట్టుకోవటమే. ఇలా ఓ స్పేస్ ఏజెన్సీ చేయటం చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా రాకెట్ లో రెండు భాగాలుంటాయి. ఒకటి స్పేస్ షిప్ క్యాప్సూల్ రెండోది దాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లే బూస్టర్. ఈ బూస్టర్ ను రాకెట్ ప్రయోగం తర్వాత మళ్లీ మళ్లీ వినియోగించుకునే టెక్నాలజీ ని కనిపెట్టింది ఎలన్ మస్క్ నేతృత్వంలోనే స్పేస్ ఎక్స్ సంస్థ. తద్వారా రాకెట్ ప్రయోగాల్లో చాలా డబ్బు ఆదా చేసుకుంటోంది. ఈ టెక్నాలజీని నాసా కి వినియోగిస్తూ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కి ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఓ పెద్ద కార్గో పార్టనర్ గా మారిపోయింది. ఇన్నాళ్లూ బూస్టర్ పార్ట్ ను నేల మీదనో..సముద్రం మీదనో తిరిగి ల్యాండ్ అయ్యేలా ప్రయోగాలు చేస్తున్న స్పేస్ ఎక్స్...ఇప్పుడు మెక్ జిల్లా అనే పేరుతో ఈ భారీ టవర్ ను రూపొందించింది. 400 అడుగుల ఎత్తుండే ఈ టవర్ లాంటి నిర్మాణానికి చోప్ స్టిక్స్ అని పిలుచుకుంటున్న ఈ రెండు చేతులు ఉంటాయి. వీటి ద్వారా రాకెట్ ను గాల్లోకి ఎగరేస్తుంది. తిరిగి దాన్ని క్యాచ్ కూడా పట్టుకుంది. ఫలితంగా పెద్ద ఎత్తున ఇంధనం ఆదా అవటంతో పాటు రాకెట్ ప్రమాదాల సమయంలో ల్యాంచ్ ప్యాడ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇంతకీ లక్ష కిలోల బరువు మోయగలిగే ఈ రాకెట్ ను ఎలన్ మస్క్ ఎందుకు తయారు చేయించాడో తెలుసా భవిష్యత్తులు మార్స్ లాంటి గ్రహాల మీదకు మనిషి వెళ్లాలంటే ఆ మాత్రం కెపాసిటీ ఉండే రాకెట్ కావాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రయోగాలన్నీ. వీటిని సూపర్ సక్సెస్ చేయటం ద్వారా స్పేస్ సైన్స్ చరిత్రలో ఎవ్వరూ చూడని విజయాలను ఎలన్ మస్క్ సాధిస్తున్నారు.