Russian President Putin Hosts Private Dinner For PM Modi | ప్రధాని మోదీకి పుతిన్ ప్రైవేట్ డిన్నర్ | ABP Desam

Russian President Putin Hosts Private Dinner For PM Modi |  రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఉక్రెయిన్ యుద్ధం తరువాత తొలిసారిగా భారత్-రష్యా మధ్య వార్షిక సమ్మిట్ మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసమే ప్రధాని మోదీ రష్యా వెళ్లారు. ఐతే.. ఈ సమ్మిట్ కు ముందే సోమవారం రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీని..పుతినే స్వయంగా ఓ కారులో ఎక్కించుకుని డిన్నర్ ప్లేస్ వరకు తీసుకెళ్లారు. అంతేకాదు... పుతిన్ డ్రైవ్ చేశారు ఆ కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే.. రష్యా అధినేతగా పుతిన్ ఎంతో పవర్ ఫుల్. తనను కలవడానికి ఎంతమంది దేశాధినేతలు వచ్చిన ఆఫీస్ లోనే కలుస్తుంటారు తప్ప.. ఇలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని... చేతిలో చేయేసి నడవడం, కారులో ఎక్కించుకోవడం వంటివి చేయలేదు. దీనిని బట్టే చెప్పొచ్చు ప్రధాని మోదీ -పుతిన్ మధ్య ఎంత మైత్రి ఉందో అన్నది. డిన్నర్ సమయంలో మోదీ 3.0 విజయాన్ని పుతిన్ కొనియాడారు. గత పదేళ్లలో ఇండియా-రష్యా మధ్య మైత్రి చాలా బలంగా మారిందని...మోదీ 3.0 సర్కార్ లోనే ఇలాగే ముందుకు సాగాలని పుతిన్ ఆకాంక్షించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola