Terrorist Attck Army Convoy in Jammu And Kashmir | సైనికులపై ఉగ్రదాడి...5 మంది మృతి | ABP Desam

Terrorist Attck Army Convoy in Jammu And Kashmir |

మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్ లోని కఠువా జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో సైనిక వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో 5 సైనికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. దాడి జరిగినప్పుడు ఈ ట్రక్కులో 10 మంది సైనికులు ఉండగా.. అందులో 5 గురు చనిపోగా..మిగతావారు గాయాలపాలయ్యారు. ఎలా జరిగిందంటే..! ముగ్గురు ముష్కరులు ఒక్కసారిగా వాహనం పైకి గ్రనేడ్‌ విసిరారు. దానిని సైనికులు పసిగట్టే లోపలే కాల్పులు జరపడంతో ఏం చేయలేకపోయారు. ఈ ఘటనతో పారామిలిటరీ దళం రంగంలోకి దిగడంతో ఉగ్రవాదులు అడువుల్లోకి పారిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఐనప్పటికీ...హెలికాఫ్టర్ సాయంతో వారి ఆచూకీ కోసం భద్రత బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. జవానుల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.  అలాగే...ఈ ఘాతుకానికి సరైన సమాధం చెప్పే పనిలో బలగాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola