ABP News

Nita Ambani Saree and jewelry | Trump Swearing Ceremony లో ప్రధాన ఆకర్షణగా నీతా,ముకేశ్ అంబానీ | ABP Desam

Continues below advertisement

 అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార మహోత్సవానికి భారత్ నుంచి అంబానీల కుటుంబానికి ఆహ్వానం అందింది. ఇంకేం అపరకుబేరులైన ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ వాషింగ్టన్ కు చేరుకున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి ముందు ట్రంప్ నిర్వహించిన పార్టీకి హాజరయ్యారు. అయితే పార్టీలో నీతా అంబానీ లుక్ మాత్రం అదిరిపోయింది. భారతీయత మన సంప్రదాయ శైలి గొప్పతనం ఉట్టిపడేలా అత్యంత ఖరీదైన కంచి పట్టుచీర కట్టుకుని వెళ్లారు నీతా అంబానీ. స్వదేశ్ వారు తయారు చేసిన ఈ కంచిపట్టు చీరలో భారతీయ ఆలయాల గొప్పతనం ప్రత్యేకతగా చారిత్రక ప్రాధాన్యత ఇమిడి ఉన్నాయి. వందకు పైగా కలెక్షన్ల పై రీసెర్చ్ వర్క్ చేసి ఫైనల్ గా ఈ చీరను సెలెక్ట్ చేశారు నీతా అంబానీ. చీరలు తయారు చేయటంలో జాతీయ అవార్డు గెల్చుకున్న బీ.కృష్ణమూర్తి ఈ చీరను రూపొందించారు. చీరపై రెండు తలల గరుడపక్షి ఉండగా అది విష్ణుమూర్తికి సంకేతం..నెమలి ఇమ్మోర్టాలిటికీ, డివినిటీకి సింబల్ కాగా...జానపదాలకు గుర్తుగా వివిధ జంతువులను ముద్రించారు. కాంటెపరరీ టచ్ కోసం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లౌజ్ ను ధరించిన నీతా అంబానీ..మెడలో 200ఏళ్ల నాటి పురాతన హారాన్ని ధరించారు. 18వ శతాబ్దానికి చెందిన ఈ పచ్చలపతకం అరుదైన రాళ్లతో రూపొందించిన హారం. చిలుక ఆకారంలో ఈ హారంలో ఎమరాల్డ్స్, రూబీస్, డైమండ్స్ తో ఖరీదైన ముత్యాలను పొదిగారు. తద్వారా భారతీయ ప్రాచీన సంప్రదాయాలను, వైభవాన్ని నీతా అంబానీ అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి తీసుకెళ్లారు. ట్రంప్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ముందు వరుసలోనే ఉన్న నీతా అంబానీ, ముఖేశ్ అంబానీ...ఆయన స్పీచ్ పూర్తైన తర్వాత ట్రంప్ తో ఫోటోలు కూడా దిగారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram