
Kolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP Desam
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా ట్రైనీ డాక్టరు హత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈ నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత కాల ఖైదును విధిస్తూ తీర్పును వెలువరించింది. గతేడాది ఆగస్టు 9న కోల్ కతా లోని ఆర్జీకర్ ఆసుపత్రిలో డ్యూటీ లో ఉన్న ఓ ట్రైనీ డాక్టర్ పై నిందితుడు సంజయ్ రాయ్ ను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్టు 10నే కోల్ కతా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆర్జీకర్ ఆసుపత్రి ధ్వంసం సహా దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సంఘాలు విధులను బహిష్కరించి ఆందోళనలు చేపట్టాయి. కేసు తీవ్రతను పరిగణలోనికి తీసుకున్న కోల్ కతా హైకోర్టు కేసుపై ప్రత్యేక కోర్టును నియమించటంతో పాటు సీబీఐ దర్యాప్తనకు ఆదేశాలు జారీ చేసింది. ఐదు నెలల పాటు దర్యాప్తు సాగించిన సీబీఐ అన్ని ఆధారాలతో సంజయ్ రాయ్ ను నేరస్థుడిగా కోర్టు ముందు ప్రూవ్ చేసింది. అయితే ఇది సామూహిక అత్యాచారం అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు ఎదురైనా...సీబీఐ మాత్రం సంజయ్ రాయ్ మాత్రమే నిందితుడిగా పేర్కొంది. దీంతో స్పెషల్ కోర్టు అయిన సీల్దా కోర్టు మరణించే వరకూ సంజయ్ రాయ్ జైలులోని ఉండాలని తీర్పునిచ్చింది.