Niagara Falls Beautiful View: సీజన్ కావటంతో నయాగరా ఫాల్స్ వద్దకు పర్యాటకుల తాకిడి
నయాగరా ఫాల్స్. ఈ జలపాతాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాస్తవానికి ఇది మూడు జలపాతాల సమూహం. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్, యూఎస్ లోని న్యూయార్క్.... వీటి బార్డర్ లో ఈ జలపాతాలు ఉంటాయి. ఈ విజువల్స్ అక్కడివే. అక్కడ సమ్మర్ సీజన్ నడుస్తోంది. జూన్ నుంచి ఆగస్ట్ దాకా టెంపరేచర్స్ బాగుంటాయని, కాబట్టి నయాగరా ఫాల్స్ చూడటానికి ఇదే బెస్ట్ టైం అని అందరూ చెప్తుంటారు. కాబట్టే ఇప్పుడు అక్కడికి పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది.