Hubble Sonification: నెబ్యూలా శబ్దాలను రికార్డ్ చేసిన నాసాకు చెందిన హబుల్
Continues below advertisement
నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ సోనిఫికేషన్ ద్వారా నెబ్యులా చేసే శబ్దాలను రికార్డు చేసింది. హెలిక్స్ అనే పేరున్న నెబ్యులా నుంచి వస్తున్న ధ్వనులను సోనిఫికేషన్ ద్వారా గుర్తించగలిగింది హబుల్ టెలిస్కోప్. నెబ్యులా లో రెడ్ లైట్ ప్రాంతం నుంచి చిన్న ధ్వని, బ్లూ లైట్ ప్రాంతం నుంచి పెద్ద ధ్వనులు వస్తున్నట్లు గుర్తించింది. దుమ్ము, హీలియం, ఇతర వాయువుల కలయికనే నెబ్యులా అంటారు. నెబ్యులా అనేది నక్షత్రంగా ఏర్పడక ముందు దశ అని..దాదాపుగా నెబ్యులాలే నక్షత్రాలుగా మారుతాయని శాస్త్రవేత్తల అంచనా. ఖగోళలంలో జరిగే మార్పులను పరిశీలించే హబుల్ టెలిస్కోప్....భూమికి 547 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ ఖగోళంలో జరిగే మార్పులను పరిశీలిస్తూ ఉంటుంది.
Continues below advertisement