Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ స్టెమ్ సెల్ ద్వారా మరో పదిమందికి కంటిచూపు
పునీత్ రాజ్ కుమార్ రియల్ హీరో. రీల్ లైఫ్‌లో హీరోగా, పవర్ స్టార్ గా మాత్రమే కాదు... రియల్ లైఫ్‌లో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. మరణానికి ముందు ఆయన తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పునీత్ నిర్ణయాన్ని గౌరవిస్తూ... రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు నేత్రాలను దానం చేశారు. వాటి ద్వారా నలుగురికి చూపు లభించింది. ఇప్పుడు మరో పది మందికి చూపు వచ్చేలా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.