FaceBook: పారదర్శకత ఫేక్? కీలక పేపర్లు లీక్!
రాజకీయ, సామాజిక విధ్వేషాలకు కారణమవుతున్న కొన్ని వ్యాఖ్యలపై ఫేస్ బుక్ చర్యలు తీసుకోలేకపోయిందని పలు అంతర్జాతీయ పత్రికలు రాశాయి. ఒకే వ్యక్తి పలు అకౌంట్లు ఓపెన్ చేయటాన్ని అరికట్టలేకపోయిందని, ఒకే ఐపీ అడ్రస్ తో ఫేక్ అకౌంట్లలోకి లాగిన్ అవుతున్నట్లుగా గుర్తించినా వాటిని తొలగించలేకపోయిందని తెలిపాయి. వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ వేదికగా జరిగిన ప్రచారాన్ని గుర్తించి ఆపాలని ఉద్యోగులు హెచ్చరించినప్పటికీ జుకర్ బర్గ్ చాలా ఆలస్యంగా వాటిపై చర్యలు ఆరంభించినట్లుగానూ పలు పేపర్లు వెల్లడించాయి. ఇలాంటి చాలా అంశాలు అంతర్జాతీయంగా ఫేస్ బుక్ పారదర్శకతపై నమ్మకం పోయేందుకు కారణమవుతున్నాయి.