Kash Patel FBI Director Oath Taking on Bhagavad Gita | కృష్ణుడి సాక్షిగా అమెరికాను కాపాడతా | ABP
అమెరికాలో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ FBI అధిపతిగా కాశ్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గుజరాత్ మూలాలున్న కాశ్ పటేల్ పూర్తి పేరు కశ్యప ప్రమోద వినోద కాశ్ పటేల్ కాగా...FBI డైరెక్టర్ గా ఎన్నికైన మొదటి హిందూ, భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ట్రంప్ కు అత్యంత నమ్మకస్థుడుగా పేరు తెచ్చుకున్న కాశ్ పటేల్ నియామకాన్ని సెనేట్ 51-49 ఓట్లతో అంగీకరించింది. అధికారిక ఉత్తర్వులు అందించిన తర్వాత వైట్ హౌస్ లో ప్రమాణస్వీకారం చేసిన కాశ్ పటేల్.. బాధ్యతలు తీసుకుంటూ భగవద్గీత మీద ప్రమాణం చేయటం విశేషం. తన గర్ల్ ఫ్రెండ్ అలెక్సీస్ విలికిన్స్, ఇతర కుటుంబసభ్యులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రమాణం చేసిన కాశ్ పటేల్... అమెరికా సారభౌమత్వాన్ని, భద్రతను, అంతర్గతగోప్యతను...శ్రీకృష్ణ భగవానుడిగా కాపాడతానంటూ ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు తీసుకోగానే FBI లో పని చేస్తున్న 1000 మంది అధికారులను ఫీల్డ్ ఆఫీసులకు బదిలీ చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నారు కాశ్ పటేల్.