Ideas of India 2025 | ముంబైలో ప్రారంభమైన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు | ABP Desam
ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు ముంబైలో ప్రారంభమైంది. ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్, ఏబీపీ నెట్ వర్క్ డైరెక్టర్ ధృబో ముఖర్జీ, ఏబీపీ నెట్ వర్క్ సీఈవో సుమంత దత్తా, ఏబీపీ న్యూస్ ఎక్స్ క్యూజిటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ ఖందేకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా ఫోర్త్ ఎడిషన్ ను ప్రారంభించారు. రెండురోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో "అవధులు లేని ఆలోచనలు..అద్భుతమైన ప్రతిభ...అంతులేని సామర్థ్యం" అన్న థీమ్ తో రాజకీయ, వ్యాపార, సినీ రంగాలతో పాటు విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చా వేదికను ఏబీపీ న్యూస్ నెట్ వర్క్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమ్మిట్ ABP లైవ్ (యూట్యూబ్, ఫేస్‌బుక్) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇంకా వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.