Israel Iran Attacks on Nuclear Sites | అణు స్థావరాలపై దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ | ABP Desam
అమెరికాతో కలిసి పాలస్తీనాను ఓ ఆటాడుకున్న ఇజ్రాయెల్ కు ఇరాన్ నుంచి ఊహించని తలనొప్పులు ఎదురుతున్నాయి. గాజాపై దాడులు ఆపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించిన ఇరాన్...ఇజ్రాయెల్ ఎంతకీ మాట వినకపోవటంతో మిస్సెల్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ ను టార్గెట్ చేసిన ఇరాన్ ఆ నగరాన్ని నామ రూపాల్లేకుండా చేసి ఇజ్రాయెల్ ను భయటపెట్టాలని ఆలోచించింది. ఇందులో భాగంగానే బాలిస్టిక్ క్షిపణులతో టెల్ అవీవ్ ను దాడులు చేసింది ఇరాన్. ఊహించని ఈ ప్రతిఘటనతో ఇజ్రాయెల్ కాస్త ఆలోచనలో పడిందనే చెప్పాలి. ఓ రోజు మొత్తం రియాక్షన్ చూపించని ఇజ్రాయెల్ ఉన్నపళంగా అర్థరాత్రి నుంచి ఇరాన్ పై దాడులు మొదలుపెట్టింది. అయితే ఏకంగా న్యూక్లియర్ సైట్ల సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. తమ ఐరన్ డోమ్ ను ఇరాన్ నాశనం చేసిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తాము మిలట్రీ క్యాంపులపై మాత్రమే దాడి చేస్తున్నామని కానీ ఇరాన్ స్కూళ్లు, ప్రార్థనా మందిరాలను వదిలిపెట్టడం లేదనేది ఇజ్రాయెల్ చేస్తున్న ప్రత్యారోపణలు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో టెల్ అవీవ్ ధ్వంసమైన దృశ్యాల శాటిలైట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇరు దేశాల దాడుల్లో ఇప్పటివరకూ 80మంది చనిపోగా...న్యూక్లియర్ సైట్స్ పై రెండు దేశాలు చేసుకుంటున్న దాడులు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకువస్తాయేమోనని పొరుగు ఉన్న దేశాలు, ప్రజలు వణికిపోతున్నాయి.