Uttarakhand Helicopter Crash | కేదార్ నాథ్ కు హెలికాఫ్టర్ లో వెళ్తున్న భక్తులు మృతి | ABP Desam

ఉత్తరాఖండ్ లో హెలికాఫ్టర్ కూలిపోయి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాఫ్టర్ ఆదివారం ఉదయం 6గురు యాత్రికులతో గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ కు బయల్దేరింది. వాతావరణం అనుకూలంగా లేకపోవటం, సాంకేతిక సమస్యల కారణంగా బయల్దేరిన 10నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఆరుగురు ప్రయాణికులతో పాటు పైలెట్ కూడా మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మే2 కేదార్ నాథ్ ఆలయం తెరిచినప్పటి నుంచి ఇది ఐదో ప్రమాదం. టూరిజాన్ని ప్రమోట్ చేయటంలో భాగంగా కేదార్ నాథ్ సులభంగా చేరుకునేలా హెలికాఫ్టర్లలో ప్రయాణించే అవకాశాన్ని తీసుకువచ్చిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి కష్టం మీద ఈరోజు హెలికాఫ్టర్ కూలిన ప్రదేశానికి NDRF, SDRF దళాలు చేరుకున్నాయి. అయితే ఎవరూ ప్రాణాలతో మిగిలకపోవటంతో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో తాత్కాలికంగా కేదార్‌ నాథ్ కు హెలీ టూరిజం సర్వీసులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola