Israel attack in Beirut | బీరుట్ యుద్ధ భూమిలో ABP News - రణక్షేత్రంలో ధైర్య సాహసాలతో | ABP Desam
ఇజ్రాయెల్- ఇరాన్, ఇజ్రాయెల్ - లెబనాన్, ఇజ్రాయెల్ హెజ్బుల్లా, ఇజ్రాయెల్ హమాస్ దేశం ఏదైనా కానీ యుద్ధదళం ఏదైనా కానీ ఇజ్రాయెల్ కనికరం చూపించటం లేదు. దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడేయాలనే ఉద్దేశంతో ఉంది కాబోలు సరిహద్దు దేశాలపై విరుచుకుపడుతోంది. ప్రధానంగా ఇజ్రాయెల్ కు తలనొప్పిగా హెజ్బుల్లా, హమాస్ లాంటి ఇస్లామిక్ సంస్థల మనుగడను తుడిచిపెట్టేయాలని ఉద్దేశంతో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ. కానీ ఆ దేశాల్లో పౌరుల పరిస్థితే దారుణాతిదారుణంగా ఉంది. రాజకీయనేతల నిర్ణయాలకు వారి వారి అధికార దాహానికి, ఆధిపత్య ధోరణకి సామాన్యులు బలైపోతున్నారు. అందుకే ఏబీపీ న్యూస్ లెబనాన్ రాజధాని బీరుట్ కు వెళ్లింది. ఏబీపీ రిపోర్టర్ జగ్యిందర్ పటియాల్ తన కెమెరా మన్ తో కలిసి ప్రాణాలకు తెగించి యుద్ధభూమిలో అడుగుపెట్టారు. రణక్షేత్రంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా శరీరం వణికిపోవాల్సిందే. జరుగుతున్న విధ్వంసాన్ని చూస్తూ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రాణాల మీద ఆశలు ఉండకూడదు. చావు అంటే భయం ఉండకూడదు. ఒక వేళ ఉన్నా ఇదిగో ఇలాంటి భయానక పరిస్థితులకు వెరవకుండా ఉండాల్సిందే. జగ్యిందర్ పటియాల్ రిపోర్టింగ్ చేస్తూ మనకు అక్కడి పరిస్థితులను వివరిస్తున్న టైమ్ లో ఇలా అక్కడే బాంబు పేలింది. అయినా పటియాల్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తన కెమెరా మెన్ తో కర్తవ్య్యాన్ని నిర్వహించారు. అక్కడి పరిస్థితులు ఎంత భయానకంగా ఏబీపీ న్యూస్ ప్రేక్షకులకు వివరించిన తన ధైర్య సాహసాలను చాటుకున్నారు.