Israel attack in Beirut | లెబనాన్ యుద్ధ క్షేత్రంలో ABP News గ్రౌండ్ రిపోర్ట్
హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో లెబనాన్ లోని దక్షిణ బీరుట్ లో 30మందికి పైగా చనిపోయారు. ఓ భవనంపై జరిగిన క్షిపణి దాడిలో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా సోదరుడు హషీం సైఫిద్దీన్ మృతి చెందినట్లు తెలుస్తోంది. యుధ్ధ క్షేత్రం నుంచి ABP NEWS ప్రతినిధి జగ్యిందర్ పటియాల్ రిపోర్టింగ్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు నిరంతరం సాగుతుండగా.. మరోవైపు ఇరాన్ యుద్ధభేరి మోగించింది. కొన్ని రోజులుగా భీకరమైన దాడులతో మిడిల్ ఈస్ట్ మండుతోంది. ఈ మంటల మధ్య నుంచే ABP న్యూస్ తొలిసారిగా గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేస్తోంది.ప్రధానంగా హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. కిందటి నెలలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన హిజ్బుల్లా చీఫ్ హషీమ్ నస్రల్లా సోదరుడు హషీమ్ సైఫిద్దీన్ సైతం నిన్న జరిగిన దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. సైఫుద్దీన్ మరణించిన ప్రాంతానికి శుక్రవారం పాటియల్ చేరుకున్నారు. సైఫుద్దీన్ హిజ్బుల్లాకు కాబోయే నాయకుడు అని కూడా ప్రచారం ఉంది.