Imran Khan Loses Midnight No-Trust Vote: అవిశ్వాస తీర్మానంలో ఓడి పదవి దిగిన ఇమ్రాన్ | ABP Desam

Continues below advertisement

Pakistan Prime Minister Imran Khan కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఇమ్రాన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 342 మంది సభ్యులున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో సాధారణ మెజార్టీ రావాలంటే 172 సీట్లు ఉండాలి. అవిశ్వాస తీర్మానంలో 174 ఓట్లు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా రావడంతో ఆయన ఓటమి పాలయ్యారు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. ప్రధానమంత్రి హోదాలో చివరిసారి ఇమ్రాన్ శుక్రవారం ప్రసంగించారు. కొత్త ప్రభుత్వాన్ని తాము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. అది కచ్చితంగా అమెరికాకు తొత్తులా మారుతుందని విమర్శించారు. ప్రజల మద్దతుతో మళ్లీ పదవి చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. పాక్ లో తర్వాత ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త ప్రధాని కోసం సోమవారం జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరగనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram