Hezbollah Strikes On Israel | నార్త్ ఇజ్రాయేల్‌పై హెజ్బుల్లా దాడులు | ABP Desam

ఇజ్రాయేల్‌..లెబనాన్‌పై అటాక్స్ చేస్తుంటే..అటు హెజ్బుల్లా ఇజ్రాయేల్‌ని టార్గెట్ చేసింది. ముఖ్యంగా నార్త్ ఇజ్రాయేల్‌లో కీలక ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. ఎక్కడ పడితే అక్కడ బాంబులతో దాడులు చేస్తోంది. కాల్పులు జరుపుతోంది. దాదాపు 90 హెజ్బుల్లా రాకెట్‌లు ఇజ్రాయేల్‌పైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనల్లో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు చనిపోతుండడం వల్ల ఇజ్రాయేల్ ఆర్మీ చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది. ఏం జరిగినా సరే..మా పౌరుల్ని కాపాడుకుంటామని తేల్చి చెబుతోంది. నార్త్ ఇజ్రాయేల్‌లో హెజ్బుల్లా దాడులకు పాల్పడగా..అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసింది ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్. భారీ కార్లపై అటాక్ చేయగా..అవి నడిరోడ్డుపైనే తగలబడిపోయాయి. స్థానికులు ఒక్కసారిగా భయపడి దూరంగా పారిపోయారు. ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. హెజ్బుల్లా ఎంత భీకరంగా దాడి చేసినా...మా పౌరుల్ని కాపాడుకుంటామని పోస్ట్ పెట్టింది IDF. ఇక లెబనాన్‌పై మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది ఇజ్రాయేల్. హెజ్బుల్లా స్థావరాలను నేలమట్టం చేస్తోంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola