Elon Musk Vs Ambani | Starlink closer to India | ట్రంప్ ఎన్నికతో ఇండియాకు స్పీడ్‌గా స్టార్ లింక్!
భూమ్మీద ఏ మారుమూల ప్రదేశానికి వెళ్లినా, ఆఖరికి నడి సముద్రంలో కూడా ఇంటర్నెట్ పొందగలిగే వెసులుబాటు స్టార్ లింక్ అనే ఒక కంపెనీ మాత్రమే అందిస్తోంది. ఇది అమెరికాకి చెందిన పాపులర్ బిజినెస్ మేన్ ఎలాన్ మస్క్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో స్టార్ లింక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇండియాలో ఇంకా స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందుబాటులో లేదు. మన దేశంలో కూడా ఆ సర్వీసెస్ ప్రవేశపెడతారని ప్రచారం ఉంది. స్టార్ లింక్ వెబ్ సైట్ లో కూడా ఇండియాలో తమ సర్వీసెస్ కమింగ్ సూన్ అనే ఉంది. Starlink’s internet kit లోని ఈ చిన్న డిష్ ని ఇంటిపైన పెట్టుకుంటే అది డైరెక్ట్ గా స్టార్ లింక్ శాటిలైట్‌తో కనెక్ట్ అవుతుంది. అక్టోబర్ 2024 నాటికి, స్టార్‌లింక్ 4,500 శాటిలైట్స్ ని కలిగి ఉంది. స్టార్ లింక్ పేరెంట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ శాటిలైట్స్ ని భూమి నుంచి 350 - 1200 కి.మీ లో ఎర్త్ ఆర్బిట్‌లో డిప్లోయ్ చేసింది. ఇవి నిరంతరం వాటి ఆర్బిట్స్‌లో 27,000 km/h స్పీడ్ తో తిరుగుతుంటాయి. 4,500 శాటిలైట్స్ కాకుండా.. 12 వేల శాటిలైట్స్ ని డిప్లోయ్ చేయాలనేది స్టార్ లింక్ లక్ష్యంగా ఉంది.