Donald Trump Going to be Win US Elections 2024 | అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి చేరువలో ట్రంప్ | ABP

 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ దుమ్మురేపారు. డెమోక్రాట్లను చిత్తు చేస్తూ అప్రతిహతంగా జైత్రయాత్ర సాగించిన ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు చేరువైపోయారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో 267 సాధించిన ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ అయిన 270 ఎలక్టోరల్ ఓట్లకు 3 ఓట్ల దూరంలో నిలిచారు. అయినప్పటికీ మిగిలిన చోట్ల ట్రంప్ ముందంజలో ఉండటంతో ఆయన విజయం దాదాపుగా ఖరారు అయ్యింది. ట్రంప్ కు ఇప్పటికే 51.2 శాతం ఓట్లు పోలవగా..ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కు 47.4 శాతం ఓట్లతో 224 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మిగిలిన చోట్ల ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ట్రంప్ ఫ్లోరిడా కన్వెన్షన్ సెంటర్ లో స్పీచ్ ఇచ్చారు. తనకు మరోసారి అవకాశమిచ్చిన అమెరికన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్...వలసదారులను అడ్డుకుని అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మరోసారి పనిచేస్తానని ప్రసంగించారు. మొత్తం పోలైన ఓట్లలో అధిక శాతం ఓట్లు డెమోక్రాట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ ఉండటం ట్రంప్ ఈసారి సాధించిన మ్యాండేట్ ను తెలియచేస్తోంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola