Canada PM: వ్యాక్సిన్ ను తప్పనిసరి చేసినందుకు కెనడాలో ట్రక్కర్ల భారీ ర్యాలీ| ABP Desam
Continues below advertisement
కెనడాలో పరిస్థితులు విషమిస్తున్నాయి. సరిహద్దులు దాటి వచ్చే ట్రక్కర్లు కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జారీ చేసిన ఆంక్షలు వివాదానికి దారి తీస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ పట్ల ట్రక్కర్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే ట్రక్కర్లునుద్దేశించి ఓ చిన్న గుంపు వ్యక్తుల వల్ల దేశానికి నష్టం చేకూరుతోంది అంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఒట్టోవా ప్రధాన రహదారులను దిగ్భందించారు ట్రక్కర్లు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని జస్టిన్ ట్రూడోను అజ్ఞాతంలోకి పంపించేసిన సైన్యం....ఆందోళనకారులను తరిమికొట్టేందుకు యత్నించటం ఇంకా వివాదాన్ని మరింత జఠిలం చేస్తోంది.
Continues below advertisement