కలర్ ఫుల్ డ్రెస్సులు వేసుకుని తాలిబన్ల నిబంధనలను వ్యతిరేకించిన మహిళలు
అఫ్గాన్ లో తాలిబన్లు విధిస్తున్న ఆంక్షలను, నిబంధనలను పలువురు మహిళలు వ్యతిరేకిస్తున్నారు. విద్యాసంస్థల్లో విధించిన నిబంధనలను, మహిళ వస్త్రధారణపై ఆంక్షలను ఎత్తివేయాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాబుల్ యూనివర్సిటీకి చెందిన తరగతి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో మహిళలందరూ బుర్కా వేసుకొని కనిపించడంతో తాలిబన్ల ఆంక్షలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మహిళలు.. కలర్ ఫుల్ దుస్తుల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.