Whatsapp New Features : వాట్సాప్ ఈ కొత్త చాట్ కంట్రోల్ ఫీచర్‌ని గ్రూప్ అడ్మిన్లకి అందించబోతోందా?
Continues below advertisement
వాట్సాప్ గ్రూపుల్లో ఈ మధ్య ఫేక్ న్యూస్, అనవసర కంటెంట్ ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్రాడ్ మెసేజ్లను గ్రూపులోని ఎవరికీ కనిపించకుండా ‘మొత్తానికే’ డిలీట్ చేసేలా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు మరో కొత్త పవర్ ఇవ్వనుంది. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ను ఇప్పటికే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ వాట్సాప్ అప్డేట్లు ఇచ్చే వాట్సాప్ బీటా ఇన్ఫో ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, దీనిపై వాట్సాప్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది.
Continues below advertisement