BJP Protest at Kanipakam: నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారా ?
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ఎదుట BJP నాయకులు ధర్నాకు దిగారు. స్వామివారి రథచక్రాలను తగులబెట్టారన్న వార్తల మేరకు వారు అక్కడికిి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరవైందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఘటన జరిగిన చోట మట్టి ఎందుకు పోశారని, నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా అని అధికారులను ప్రశ్నించారు.