Sajjanar : సదాశివపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సజ్జనార్

సదాశివపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ ను ఆర్టీసి ఎం.డి సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు, ప్రయాణికుల సౌకార్యర్ధం తీసుకుంటున్న చర్యలపై అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు, అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసి నిలకడగా ఉందని.. త్వరలోనే ఆర్టీసి లాభాల్లో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు, కావున ప్రయాణికులు భయపడకుండా సురక్షితంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించవచ్చని అన్నారు, అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపిస్తున్నట్లు చెప్పారు, ఆర్టీసికి మంచి లాభాలు ఉండే హైదరాబాద్ నుండి జహీరాబాద్ రూట్ లో మరిన్ని సేవలు అందిస్తామన్నారు, ఆర్టీసి అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola