Weird Shaped Planet Discovered:వెరైటీ షేపు గ్రహాన్ని కనుగొన్న ఆస్ట్రోనాట్స్| Solar System
మన సోలార్ సిస్టంలో అన్ని గ్రహాలు గుండ్రంగానే ఉంటాయి. అంతమాత్రాన మన గెలాక్సీలో ఉన్న అన్ని సోలార్ సిస్టమ్స్ లోని గ్రహాలు అలానే ఉంటాయనకుంటే పొరపాటే. ఇటీవలే బంగాళదుంప ఆకారంలో ఉన్న ఓ గ్రహాన్ని గుర్తించారు కొందరు ఆస్ట్రోనాట్స్. భూమి నుంచి 1500 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని WASP-103bగా పిలుస్తున్నారు. దీని బరువు జూపిటర్ కన్నా 1.5 రెట్లు ఎక్కువని తేల్చారు. ఈ గ్రహం తన హోస్ట్ స్టార్ కి అత్యంత చేరువలో, అంటే 20వేల మైళ్ల కన్నా దగ్గరగా ఉండటంతో... ఆ ప్రభావం గ్రహం రూపుపై పడిందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ బంగాళదుంప షేప్ వచ్చి ఉండొచ్చని అంటున్నారు. ఈ గ్రహాన్ని 2014లోనే కనుగొన్నా, దాని షేప్ ను ఇప్పుడే బయటపెట్టారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఓ సంవత్సరం పడితే.... ఈ WASP-103b 22 గంటల్లోనే తన హోస్ట్ స్టార్ చుట్టూ తిరిగేయగలదు. గ్రహాల తీరుతెన్నులను తెల్సుకోవడంలో తాజా ఫైండింగ్స్ ఉపయోగపడతాయని ఆస్ట్రోనాట్స్ అనుకుంటున్నారు.