Weekedn Curfew Lifted : రాజధాని నగరంలో మారిన కోవిడ్ గైడ్ లైన్స్...బార్లు, రెస్టారెంట్లు రీ ఓపెన్
ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేస్తూ కేజ్రీ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది. రాజధాని నగరంలో కోవిడ్ గైడ్ లైన్స్ ను సడలిస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన స్థానిక ప్రభుత్వం...బార్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లలో 50శాతం ఆక్యుపెన్సీకి అనుమతునిచ్చింది. పాఠశాలలను తిరిగి తెరిచే అంశంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీ విపత్తు నిర్వహణా సంస్థ వెల్లడించింది.