Google Doodle: భారత మహిళా వైద్యశాస్త్రవేత్తకు డూడుల్ గౌరవిమిచ్చిన గూగుల్
Continues below advertisement
మానవాళి సంక్షేమం కోసం కృషి చేసిన వారికి, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో గౌరవించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ ఓ భారతీయ వైద్యురాలిని స్మరించికుంది. ప్రత్యేక డూడుల్‌ని క్రియేట్ చేసింది. డూడుల్‌లో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్ కమల్ రణదీవ్. నవంబర్ 8న డాక్టర్ కమల్ రణదీవ్ 104వ జయంతి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో స్మరించుకుంది. డాక్టర్ రణదీవ్, ఒక భారతీయ కణ జీవశాస్త్రవేత్త. సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
Continues below advertisement