Warner-Kohli: విరాట్ కోహ్లీకి మద్దతుగా మాట్లాడిన డేవిడ్ వార్నర్
ఆధునిక తరం క్రికెట్ లో విరాట్ కోహ్లీ అంటే... పరుగుల యంత్రం. సెంచరీల సామ్రాట్. అయితే రెండేళ్ల నుంచి విరాట్ బ్యాట్ ఆశించిన స్థాయిలో మాట్లాడట్లేదు. ఈ విషయంలో ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కోహ్లీని వెనుకేసుకుని వచ్చాడు. ఓ భారతీయ జర్నలిస్ట్ తో మాట్లాడిన వార్నర్... కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాటర్ కొన్నాళ్లు విఫలమైనా పర్లేదని, కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్న ఆటగాడికి ఇలాంటి ఫేజ్ అర్థం చేసుకోదగిన విషయమేనన్నాడు. కొన్నిసార్లు వారి మీద ఉండే అధిక ఒత్తిడిని సహజమేనన్నాడు.