VRA Demands: తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏల ఆందోళన
వీఆర్ఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కు పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగా కడప కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సి ఐ టీయూ నాయకులు శ్రీనివాసులు రెడ్డి వి.ఆర్.ఏ ల ఆందోళన కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి.ఆర్.ఏ ల న్యాయమైన సమస్యల పరిష్కారం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నామినిలుగా పనిచేస్తూన్న వారిని వి.ఆర్.ఏ లు గా నియమించాలని అలాగే ఖాళీగా ఉన్న అటెండర్, వాచమన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.