మందు మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి ప్రజల కష్టాలపై లేదన్న తెలుగు మహిళలు

Continues below advertisement

మద్యం ధరలు తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖ నగరంలో తెలుగు మహిళలు ధర్నా నిర్వహించారు . నిత్యావసరాల ధరలు ,చెత్త పన్ను ,ఇంటి పన్ను లాంటివి ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో వాటిని తగ్గించడం మాని మద్యం ధరలు తగ్గించడమేంటి అని వారు ప్రశ్నించారు . జగదాంబ సెంటర్ దగ్గర్లోని ఒక మద్యం దుకాణానికి వెళ్లి ,బాటిల్స్ కొని మరీ వాటిని బద్దలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు . ఎంతో మంది ఆడవాళ్ళ తాళి బొట్లు తెగిపోవడానికి కారణం ఈ మద్యం అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళను  అడ్డుకున్న పోలీసుల చర్యను నిరసిస్తూ లాక్ డౌన్ టైంలో పోలీసులే దగ్గరుండి మరీ మద్యం అమ్మించిన రోజులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. అనంతరం పోలీసులు వారిని అక్కడినుండి బలవంతంగా పంపించేశారు .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram