వేడుకలను ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్ ‘పా’ బలరామ్
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలను సంస్ధ డైరెక్టర్ 'పా’ బలరామ్ ప్రారంభించారు.వేడుకల సందర్భంగా సింగరేణి జెండాను ఆవిష్కరించి సింగరేణి గీతాన్ని ఆలపించారు.అనంతరం సింగరేణిలో అనుసరిస్తున్న నూతన టెక్నాలజీ స్టాల్స్‌ను ప్రారంభించి పరిశీలించారు. సింగరేణీయులు మరింత స్పూర్తితో ముందుకు సాగి, సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కోరారు.