RRR Komuram Bheem Song Promo : ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
Continues below advertisement
కొమరం భీమ్ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర పేరు. ఆల్రెడీ రిలీజైన టీజర్లు, ట్రైలర్‌లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించారు. ఇప్పుడు 'రివోల్ట్ ఆఫ్ భీమ్' పేరుతో ఓ పాట విడుదల చేస్తున్నారు. సినిమాలో నాలుగో పాట ఇది. శుక్రవారం విడుదల కానుంది. సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆయన తనయుడు కాలభైరవ ఆలపించారు. తెలుగులో సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యం అందించారు.
Continues below advertisement