Visakha Ring Nets: విశాఖపట్నంలో భగ్గుమన్న రింగు వలల వివాదం
విశాఖలో రంగువలల వివాదం భగ్గుమంది. పెదజాలరి పేట, జాలరి ఎండాడ మత్య్సకారుల మధ్య నెలకొన్న వివాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎండాడ గ్రామంలోకి చొరబడిన పెదజాలారి పేట మత్స్యకారులు రింగ్ వలలను ధ్వంసం చేశారు. అంతే కాకుండా అక్కడే ఉన్న ఓ బోటును దగ్ధం చేశారు. రింగువలల వాడకంతో సాంప్రదాయక మత్స్యకారుల ఉపాధిపై దెబ్బపడుతోందని పెద్దజాలారిపేట మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాలను శాంతింపచేసేందుకు అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు.