MLA Dharmana: వంద రూపాయల పన్ను వసూలు చేస్తుంటే ఇంత రాద్ధాంతమా..?
చెత్తపన్ను వసూలుపై శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చెత్త పన్ను కింద వందరూపాయలు కట్టేందుకు ప్రజలు ఎందుకు అంత రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించిన ధర్మాన.....పది పథకాల కింద మాత్రం డబ్బులు తీసుకుంటారా అని ప్రశ్నించారు. అంతే కాదు పన్ను కట్టని ఇళ్ల నుంచి చెత్త తీసుకెళ్లమన్న ధర్మాన...చెత్త తీసుకువచ్చి వాళ్లింటే ముందే పడేస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.