Visakha Manyam Tourists Rush: కనుమ, ఆదివారం కలిసి రావటంతో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ
విశాఖ మన్యంలో సందర్శకుల రద్దీ బాగా పెరిగింది. కనుమ, ఆదివారం కలిసి రావటంతో విశాఖ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు అన్నీ టూరిస్టులతో సందడిగా మారాయి. మన్యంలోని వంజంగి, లమ్మసింగి లాంటి మారుమూల ప్రాంతాలకు పర్యటకులు పోటెత్తారు. ప్రకృతి అందాలతో మమేకమవుతూ సంక్రాంతి పండుగను నిర్వాహకులు ఘనంగా నిర్వహించుకున్నారు.