Virat Kohli Biopic : త్వరలో విరాట్ కోహ్లీ బయోపిక్..?
బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్... విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించేందుకు ఆసక్తి కనబర్చాడు. ఇటీవల ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు కార్తిక్ సమాధానమిచ్చాడు. ఏ క్రికెటర్ బయోపిక్ చేసేందుకు ఇష్టపడతారు అని ఫ్యాన్ అడగ్గా... కార్తిక్.. విరాట్ పేరును చెప్పాడు. బాలీవుడ్ లో ఇప్పుడు క్రికెట్ బేస్డ్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. 83 ఇప్పటికే విడుదలవగా, జెర్సీ సినిమా లైన్ లో ఉంది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి బయోపిక్స్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.