Vijayawada CP Kanthi Rana Tata : నాలుగు రోజుల్లో చడ్డీ గ్యాంగ్ ను పట్టుకుంటాం
రాజదాని జిల్లాలను హడలెత్తిస్తున్న చడ్డీ గ్యాంగ్ కు బెజవాడ పోలీసు కమీషనర్ క్రాంతి రాణా టాటా వార్నింగ్ ఇచ్చారు.ఇంకో నాలుగు రోజుల్లో గ్యాంగ్ అంతు చూస్తామని హెచ్చరించారు.ప్రజలు ఎవరూ ఆందోళన కు గురి కావాల్సిన అసవరం లేదని ఆయన స్పష్టం చేశారు.కేవలం సంపన్నులు ఉండే గేట్ వే కమ్యూనిటిలను ,విల్లాలను టార్గెట్ చేసి చడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతుందని ఆయన చెప్పారు.ఇంతకీ చడ్డీ గ్యాంగ్ ఎలాంటి నేరాలకు పాల్పడుతుంది...వారిని ఎలా పట్టుకుంటారు..ఆ వివరాలు ఎబీపీ దేశం కు బెజవాడ సీపీ వివరించారు.