Vijayawada Book festival: విజయవాడ పుస్తకమహోత్సంపై ప్రచారం చేస్తూ భారీ ర్యాలీ
32వ పుస్తక మహోత్సవాన్ని పురస్కరించుకొని పుస్తక ప్రియుల పాదయాత్ర ప్రెస్‌క్లబ్ నుంచి స్వరాజ్య మైదానం వరకు నిర్వహించారు. ఈ పాదయాత్రను శిపోడియా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సంఘసంస్కర్తలు, జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు. కవులు, రచయితలు, సాహితీవేత్తలు, పుస్తక ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొని పుస్తక పఠన ప్రాధాన్యతను తెలియచేశారు