Vicky Koushal: నా పర్మిషన్ లేకుండా ఎలా వాడతారు... విక్కీ కౌశల్ పై ఇండోర్ వ్యక్తి పోలీస్ కంప్లైంట్
Continues below advertisement
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ మీద ఇండోర్ కు చెందిన జైసింగ్ అనే వ్యక్తి పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. తన పర్మిషన్ తీసుకోకుండా తన బైక్ నెంబర్ ను వాడుకున్నారంటూ ఫిర్యాదు చేశాడు. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా 'లుకా చుప్పి 2'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్ లీకైంది. అందులో ఉన్న బండి నెంబర్ చూసి విక్కీ నడుపుతున్న బైక్ నెంబర్ తనదని జైసింగ్ మండిపడ్డాడు.
Continues below advertisement