ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు...
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ మండల దీక్ష విరమణ మహోత్సవాలు ఈనెల 25 నుంచి 29వరకు ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక క్యూలైన్లు, జల్లు స్నానాలు, కేశఖండన శాలలు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, హోమగుండాలు, విద్యుదీకరణ పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భవానీలు వారి వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేశారు.