Vemulawada Muslims Ideal Decision : ఫుడ్ వేస్టేజ్, అదనపు ఖర్చు తగ్గించే నిర్ణయం
మామూలుగా పెళ్లి అంటే చాంతాడంత మెనూ ఉండాల్సిందే. దీనివల్ల పెళ్లికూతురు కుటుంబంపై భారమే కాకుండా, వివాహానికి వచ్చినవారు సరిగ్గా తినక ఫుడ్ వృథా అవుతోందని గుర్తించారు వేములవాడకు చెందిన ముస్లిం పెద్దలు. అంతా కలిసి ఇటీవల సమావేశమై ఇకపై ఫిబ్రవరి 1 నుంచి జరిగే పెళ్లిళ్లల్లో బగారా రైస్, ఓ కర్రీ, ఓ స్వీటు మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. దీనిపై అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.